సికింద్రాబాద్ రైల్వే.స్టేషన్.లో.పార్కింగ్ బాదుడు
హైదరాబాద్, 19 జనవరి (హి.స.)శంషాబాద్‌ విమానాశ్రయంలో వాహనాల పార్కింగ్‌ ఛార్జీలు అధికం అనుకుంటే... అంతకుమించి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో వసూలు చేస్తున్నారు. ఎయిర్‌పోర్టులో వాలెట్‌ పార్కింగ్‌ సదుపాయం ఉంది. లాంజ్‌లో కారు దిగి వాలెట్‌ డ్రైవర్‌కు వాహ
సికింద్రాబాద్ రైల్వే.స్టేషన్.లో.పార్కింగ్ బాదుడు


హైదరాబాద్, 19 జనవరి (హి.స.)శంషాబాద్‌ విమానాశ్రయంలో వాహనాల పార్కింగ్‌ ఛార్జీలు అధికం అనుకుంటే... అంతకుమించి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో వసూలు చేస్తున్నారు. ఎయిర్‌పోర్టులో వాలెట్‌ పార్కింగ్‌ సదుపాయం ఉంది. లాంజ్‌లో కారు దిగి వాలెట్‌ డ్రైవర్‌కు వాహనం ఇస్తే పార్క్‌ చేసి కావాలనుకున్నప్పుడు తీసుకొచ్చి ఇస్తాడు. ఈ తరహా సేవలతో కలిపి ఇక్కడ రెండు గంటల వరకు రూ.500 తీసుకుంటారు. రైల్వేస్టేషన్‌ టెర్మినల్‌-2లో 1.24 గంటలకే రూ.500 ఛార్జ్‌ చేస్తున్నారు. రైల్వే టికెట్‌కంటే పార్కింగ్‌ రుసుములే భయపెడుతున్నాయి. ఈ అంశం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande