
అమరావతి, 19 జనవరి (హి.స.) సీఎం చంద్రబాబు) స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో సీఎంకు ప్రవాసాంధ్రులు ఘనస్వాగతం పలికారు. అనంతరం అక్కడ చంద్రబాబును సింగపూర్ అధ్యక్షుడు షణ్ముగరత్నం, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా కలిశారు. వివిధ అంశాలపై చంద్రబాబు వారితో చర్చించారు. దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు సీఎం వెళ్లనున్నారు. జ్యూరిక్ నుంచి రోడ్డుమార్గంలో ఆయన దావోస్ చేరుకుంటారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ