
తిరుమల19 జనవరి (హి.స.):పార్వేటి మండపం వద్ద ఏనుగుల గుంపు మరోసారి హల్‌చల్ చేశాయి. ఆదివారం అర్ధరాత్రి తిరుమల అటవీ ప్రాంతం నుంచి ఏనుగుల గుంపు ఒక్కసారిగా రహదారిపైకి వచ్చింది. ఆ విషయాన్ని విధుల్లో ఉన్న అటవీ శాఖ సిబ్బంది గుర్తించారు. ఆ వెంటనే వారు రంగంలోకి దిగారు. ఏనుగుల గుంపులను అటవీ ప్రాంతంలోకి తిరిగి వెళ్లేలా వారు చర్యలు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ