
నకిరేకల్19 జనవరి (హి.స.)సంక్రాంతి సంబరాలు ముగిసిన తర్వాత గ్రామాల నుంచి పట్టణాలు, నగరాలకు తిరిగి వెళ్లే చాలామంది ఈ తెల్లవారుజామున బయలుదేరారు. అయితే.. దారి పొడవునా తీవ్రమైన పొగమంచు రహదారిని కనిపించకుండా చేసింది.
నకిరేకల్ సమీపంలోని NH-65(హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి) పూర్తిగా పొగమంచుతో కప్పుకుపోయింది. ఉదయం నుంచే దట్టమైన పొగమంచు రహదారిని పూర్తిగా కమ్మేసింది. కొంచెం దూరంలో ఉన్న వాహనాలూ కనిపించనంత దట్టంగా పొగమంచు అల్లుకుంది. దీంతో వాహనదారులు చాలా జాగ్రత్తగా, చాలా నెమ్మదిగా ప్రయాణం చేయాల్సి వస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ