పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ టూర్..
హైదరాబాద్, 19 జనవరి (హి.స.) ప్రపంచ పెట్టుబడులకు కేరాఫ్ అయిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సుకు సర్వం సిద్ధమైంది. స్విట్జర్లాండ్లోని దావోస్లో నేటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకూ ఈ ప్రతిష్టాత్మక సదస్సు జరగనుంది. ఈ సారి గతం కన్నా ఎక్కువ పెట్టుబడులు
సీఎం రేవంత్ రెడ్డి దావోస్


హైదరాబాద్, 19 జనవరి (హి.స.)

ప్రపంచ పెట్టుబడులకు కేరాఫ్ అయిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సుకు సర్వం సిద్ధమైంది. స్విట్జర్లాండ్లోని దావోస్లో నేటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకూ ఈ ప్రతిష్టాత్మక సదస్సు జరగనుంది.

ఈ సారి గతం కన్నా ఎక్కువ పెట్టుబడులు రాబట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం దావోస్ టూర్కు వెళ్తున్నది. ఈ సారి జరిగే టూర్ను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ గేట్వేగా వినియోగించుకోవాలని రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది.

నేటి నుంచి 23వ తేదీ వరకూ దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సోమవారం దావోస్కు బయలుదేరి వెళ్ళింది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande