కుంభమేళా తరహాలో మేడారం జాతర.. సీఎం రేవంత్ రెడ్డి
మేడారం, 19 జనవరి (హి.స.) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మేడారం పర్యటనలో భాగంగా రెండో రోజు సోమవారం ఉదయం వనదేవతలను దర్శించుకున్నారు. మంత్రులతో కలిసి ఇటీవల సుమారు 101 కోట్ల రూపాయలతో ఆధునీకరించిన సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని, నూతనంగా ఏర్పాటు చేసిన
రేవంత్ రెడ్డి మేడారం


మేడారం, 19 జనవరి (హి.స.)

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మేడారం పర్యటనలో భాగంగా రెండో రోజు సోమవారం ఉదయం వనదేవతలను దర్శించుకున్నారు. మంత్రులతో కలిసి ఇటీవల సుమారు 101 కోట్ల రూపాయలతో ఆధునీకరించిన సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని, నూతనంగా ఏర్పాటు చేసిన పైలాన్ను ఆయన ప్రారంభించారు. అనంతరం వనదేవతల గద్దెల వద్ద తొలి మొక్కు సమర్పించిన సీఎం, తన మనవడితో కలిసి తులాభారంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. కుంభమేళా తరహాలో మేడారం జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని, గిరిజన సంస్కృతికి అద్దం పట్టేలా అభివృద్ధి పనులను పూర్తి చేశామని వెల్లడించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande