
పెద్దపల్లి, 19 జనవరి (హి.స.)
పెద్దపల్లి జిల్లాను సోమవారం విపరీతమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం 9 గంటలు దాటినా పొగమంచు ప్రభావంతో 10 మీటర్ల దూరంలోని ప్రాంతం కూడా కనిపించ లేదు. జిల్లా మొత్తం మంచు కప్పేసి ఉండటంతో ఢిల్లీని తలపిస్తోంది.
పొగమంచు వలన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైల్వే సిగ్నల్స్ కనిపించకపోవడంతో లోకోపైలట్లు రైళ్ల వేగాన్ని తగ్గించి నెమ్మదిగా వెళ్లడం జరిగింది. చల్లటిగాలులు వీస్తుండటంతో ఇళ్లలో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు