
హైదరాబాద్, 19 జనవరి (హి.స.)
రేవంత్ రెడ్డి అవుట్సోర్సింగ్ సీఎం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు. ఔట్ సోర్సింగ్ సీఎం, అసలైన కాంగ్రెస్ నాయకుల మధ్య పంచాయతీ జరుగుతుందని తెలిపారు. ఒకరేమో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వీరవిధేయులం అని.. ఒకాయన చంద్రబాబుకు వీరవిధేయులమని అంటున్నారని పేర్కొన్నారు. ఇద్దరూ తెలంగాణకు బద్ధ వ్యతిరేకులే అని స్పష్టం చేశారు.
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సోమవారం హరీశ్ రావు మాట్లాడుతూ.. సింగరేణి నైని బొగ్గు గని టెండర్ల వ్యవహారంలో పూర్తి వివరాలను త్వరలోనే బయటపెడతానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారని గుర్తుచేశారు. పూర్తి వివరాలు వెల్లడించకపోతే వాటాల మధ్య సయోధ్య కుదిరినట్లే అని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు