'ఒక్కటి యాది పెట్టుకోండ్రి.. కర్మ ఎవ్వర్నీ ఇడిసిపెట్టదు': సజ్జనార్ సంచలన పోస్ట్
హైదరాబాద్, 19 జనవరి (హి.స.) సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల తీరుపై సీపీ వీసీ సజ్జనార్ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం డబ్బు కోసం లక్కీ డ్రాల పేరుతో ప్రజలను మోసం చేయవద్దని, నమ్మిన వారిని వంచించడం తగదని హితవు పలికారు. మిమ్మల్ని నమ్మి జనాల
సజ్జనార్


హైదరాబాద్, 19 జనవరి (హి.స.)

సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల తీరుపై సీపీ వీసీ సజ్జనార్ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం డబ్బు కోసం లక్కీ డ్రాల పేరుతో ప్రజలను మోసం చేయవద్దని, నమ్మిన వారిని వంచించడం తగదని హితవు పలికారు.

మిమ్మల్ని నమ్మి జనాలు ఫాలో అవుతున్నారంటే.. ఏదన్నా మంచి కంటెంట్ చేయండి. అంతేగాని, పైసల కోసం జనాన్ని మాత్రం దోచుకోకండ్రి! ఒక్కటి యాది పెట్టుకోండ్రి.. కర్మ ఎవ్వర్నీ ఇడిసి పెట్టదు. అది ఎక్కడికో ఎత్తుకపోయి, మల్లా గొయ్యి తీసి పూడ్చేస్తది! చేసేది మోసం అని మీ మనసుకి తెలుసు కదా? చట్టాన్ని లైట్ తీసుకుంటే చివరకు నష్టపోతారు” అని సజ్జనార్ ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. అలాగే తప్పుడు ప్రకటన పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande