
హైదరాబాద్, 19 జనవరి (హి.స.)
తెలంగాణలో త్వరలో జరగనున్న
మున్సిపల్ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.
రాబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల నిర్వహణ, పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తూ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మంత్రులకు ఇన్‌చార్జ్ బాధ్యతలను అప్పగించారు.
నియోజకవర్గాల వారీగా నియమించిన ఇన్‌చార్జ్‌లు.. ఆదిలాబాద్: సుదర్శన్ రెడ్డినిజామాబాద్: ఉత్తమ్‌కుమార్ రెడ్డిమల్కాజ్‌గిరి: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిచేవెళ్ల: శ్రీధర్‌బాబుమెదక్: వివేక్కరీంనగర్: తుమ్మల నాగేశ్వరరావుపెద్దపల్లి: జూపల్లి కృష్ణారావునల్గొండ: అడ్లూరి లక్ష్మణ్భువనగిరి: సీతక్కవరంగల్: పొంగులేటిమహబూబ్‌నగర్: పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహాజహీరాబాద్: అజహరుద్దీన్‌నాగర్‌కర్నూల్: వాకిటి శ్రీహరిఖమ్మం: కొండా సురేఖ
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..