తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా.. మరో మూడు రోజుల్లో నోటిఫికేషన్!
హైదరాబాద్, 19 జనవరి (హి.స.) తెలంగాణలో మరో స్థానిక సంస్థల సమరానికి ముహూర్తం ఖరారైంది. మేడారం సమ్మక్క-సారలమ్మ సాక్షిగా ఆదివారం (జనవరి 18, 2026) జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు ఫి
మున్సిపల్ ఎలక్షన్


హైదరాబాద్, 19 జనవరి (హి.స.)

తెలంగాణలో మరో స్థానిక సంస్థల సమరానికి ముహూర్తం ఖరారైంది. మేడారం సమ్మక్క-సారలమ్మ సాక్షిగా ఆదివారం (జనవరి 18, 2026) జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు ఫిబ్రవరి నెలలో ఎన్నికలు జరపాలని నిర్ణయిస్తూ ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ రాసింది. మరో మూడు రోజుల్లోనే అధికారిక ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

ఇప్పటికే రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి మేయర్, చైర్పర్సన్ పదవుల రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande