
అమరావతి, 19 జనవరి (హి.స.)
రాష్ట్రవ్యాప్తంగా చలి గజగజ వణికించేస్తోంది. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లోనే కాదు మధ్యాహ్నం కూడా చలి తీవ్రత పెరుగుతుంది. ఈ క్రమంలో వాతావరణ శాఖ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల(జనవరి) చలి తీవ్ర ఎక్కువగా ఉంటుందని చెబుతోంది. ఆ తర్వాత కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.
ఈ నేపథ్యంలో ఏపీలోని పలు జిల్లాల్లో దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో వాతావరణ శాఖ మరోసారి కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఏపీ(Andhra Pradesh)లోని అన్ని జిల్లాల్లో పొగమంచు ఎక్కువ ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో విజిబిలిటీ(దృశ్యమానత) కేవలం 300 మీటర్లకు పడిపోయిందని వెల్లడించింది
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV