దావోస్ 2026కి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉంది : మంత్రి లోకేశ్
అమరావతి, 19 జనవరి (హి.స.) వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (Davos) 2026 సదస్సుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వసన్నద్ధమైందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) స్పష్టం చేశారు. ఏపీని ఒక నమ్మకమైన గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ (Global Investment) గమ్
Lokesh


అమరావతి, 19 జనవరి (హి.స.)

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (Davos) 2026 సదస్సుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వసన్నద్ధమైందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) స్పష్టం చేశారు. ఏపీని ఒక నమ్మకమైన గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ (Global Investment) గమ్యస్థానంగా నిలపడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) దార్శనికతను గుర్తు చేస్తూ.. 90వ దశకంలోనే భారతదేశం నుంచి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన తొలి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్లలో ఆయన ఒకరని లోకేశ్ కొనియాడారు. కేవలం ఎంఓయూలపై సంతకాలు చేయడం కోసమే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార, సాంకేతిక పోకడలు ఏ దిశగా సాగుతున్నాయో అర్థం చేసుకునేందుకు దావోస్ ఒక గొప్ప వేదిక అని ఆయన అభిప్రాయపడ్డారు.

దావోస్ సదస్సు అనేది అంతర్జాతీయ స్థాయి ఆలోచనల వినిమయానికి కేంద్రమని, ఇక్కడ జరిగే చర్చలు భవిష్యత్ నిర్ణయాలకు మార్గదర్శకాలుగా నిలుస్తాయని మంత్రి పేర్కొన్నారు. పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలతో దీర్ఘకాలిక సంబంధాలను ఏర్పరచుకోవడానికి, స్థిరమైన ఆలోచనలను పంచుకోవడానికి ఈ వేదిక దోహదపడుతుందని వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande