
పుట్టపర్తి, 19 జనవరి (హి.స.)శ్రీసత్యసాయి జిల్లాలో ముగ్గురు పోలీసులపై వేటు పడింది. వారిపై వేటు వేస్తూ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలను జారీ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా తనకల్లు ఎస్ఐ గోపీతో పాటు హెడ్ కానిస్టేబుల్ రామాంజనేయులును ఎస్పీ సస్పెండ్ చేశారు. అదే విధంగా అవినీతి, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో పుట్టపర్తి అర్బన్ సీఐ శివాంజనేయులుపై చర్యలు తీసుకున్నారు. ప్రజలకు భద్రత కల్పించాల్సిన పోలీసుల ముందే నిండు ప్రాణం బలికావడం పట్ల ఎస్పీ సీరియస్ అయ్యారు. స్టేషన్ అధికారిగా ఉంటూ అక్రమాలకు పాల్పడడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఆదర్శవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణకు జిల్లాలో పెద్దపీట వేస్తున్నామని స్పష్టం చేశారు. పోలీసు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV