యోగి వేమన నీతి సూత్రాలు అనుసరణీయం : సీఎం
అమరావతి, 19 జనవరి (హి.స.) విశ్వదాభిరామ వినురవేమా అంటూ యోగి వేమన (Yogi Vemana) చెప్పిన నీతి సూత్రాలు అనుసరణీయమైనవని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) అన్నారు. వేమన జయంతిని పురస్కరించుకొని ఆయనకు సీఎం ఘన నివాళులు అర్పించారు. వేమన గొప్ప
సీఎం చంద్రబాబు


అమరావతి, 19 జనవరి (హి.స.)

విశ్వదాభిరామ వినురవేమా అంటూ యోగి వేమన (Yogi Vemana) చెప్పిన నీతి సూత్రాలు అనుసరణీయమైనవని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) అన్నారు.

వేమన జయంతిని పురస్కరించుకొని ఆయనకు సీఎం ఘన నివాళులు అర్పించారు. వేమన గొప్ప తనాన్ని పొగుడుతూ ఎక్స్ (x.com) వేదికగా తన సందేశాన్ని ప్రజలతో పంచుకున్నారు. ప్రజాకవి, సామాజిక సంఘ సంస్కర్తగా యోగి వేమన గుర్తింపు పొందారన్నారు. సమాజంలో బేధభావాలను తగ్గించేందుకు కృషి చేశారన్నారు. కులమత బేధాలు, మూఢ నమ్మకాలను రూపు మాపేందుకు తన పద్యాల ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చారన్నారు.

ఆయన రాసిన వేమన శతకం నేటికి కూడా సంబద్ధమైనదని, ఆచరించదగినదని, వాస్తవాలను కళ్లకు కడుతుందని వివరించారు. అటువంటి మహనీయుడిని స్మరించుకోవడం నిజంగా గొప్పవిషయంగా పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande