
అనంతపురం, 02 జనవరి (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం చోటుచేసుకోనుంది. వచ్చే నెల ఫిబ్రవరి 2న కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఏఐసీసీ (AICC) చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
కాగా, శింగనమల నియోజకవర్గ పరిధిలోని బండ్లపల్లి గ్రామాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఈ పర్యటనకు వేదికగా ఖరారు చేసింది.. 2006 ఫిబ్రవరి 2న అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ కలిసి దేశవ్యాప్తంగా చారిత్రక మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (MGNREGA) ఇక్కడి నుంచే ప్రారంభించారు. ఈ పథకం ప్రారంభించి 20 ఏళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో అగ్రనేతలు మళ్లీ అదే గ్రామానికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV