
విశాఖపట్నం, 02 జనవరి (హి.స.)
ఉమ్మడి విశాఖపట్నం జిల్లా, ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో ఉన్న పాయకరావుపేట ఎస్సీ రిజర్వుడు నియోజవర్గం మాజీ శాసన సభ్యురాలు గంటెల సుమన (63) మృతి చెందారు. శుక్రవారం తెల్లవారుజామున వారు కన్నుమూశారని కుటుంబ సభ్యులు ప్రకటించారు. ప్రస్తుతం సుమన అక్కయ్యపాలెంలో నివసిస్తున్నారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నారు. చికిత్స పొందుతున్న క్రమంలో గంటెల సుమన తుదిశ్వాసను విడించారు. తన రాజకీయ ప్రస్థానంలో తొలుత తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఆమె విజయం సాధించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV