జోగి బ్రదర్స్‌కు మూడు రోజుల కస్టడీ
విజయవాడ, 02 జనవరి (హి.స.) నకిలీ మద్యం కేసులో (Fake Liquor Case) నిందితుల విచారణ కొనసాగుతోంది. కేసులో నిందితులైన మాజీ మంత్రి జోగి రమేశ్ (Jogi Ramesh) తోపాటు ఆయన సోదరుడు రామును ఎక్సైజ్ పోలీసులు మూడు రోజులపాటు కస్టడీకి తీసుకోనున్నారు. ఈ మేరకు అధికా
విజయవాడ


విజయవాడ, 02 జనవరి (హి.స.)

నకిలీ మద్యం కేసులో (Fake Liquor Case) నిందితుల విచారణ కొనసాగుతోంది. కేసులో నిందితులైన మాజీ మంత్రి జోగి రమేశ్ (Jogi Ramesh) తోపాటు ఆయన సోదరుడు రామును ఎక్సైజ్ పోలీసులు మూడు రోజులపాటు కస్టడీకి తీసుకోనున్నారు.

ఈ మేరకు అధికారులు వేసిన పిటిషన్ కు కోర్టు అనుమతించింది. దీంతో విజయవాడ జైలు నుంచి జోగి బ్రదర్స్ ను ఎక్సైజ్ పోలీసులు విజయవాడ ఈస్ట్ ఎక్సై్జ్ స్టేషనుకు తరలించారు. నకిలీ మద్యం కేసులో మూడు రోజులపాటు వారిని విచారించనున్నారు. అయితే నకిలీ మద్యం కేసులో జనార్థన్ రావు, జగన్మోహన్ రావు సోదరులకు జోగి బ్రదర్స్ అండగా ఉన్నారని ఆరోపణలున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande