కరకట్ట నుంచి దూరం తగ్గింది.. అమరావతి దగ్గరైంది
అమరావతి, 02 జనవరి (హి.స.) ఆంధ్రుల రాజధాని అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు (Seed Access Road) పనులు వేగంగా పూర్తవుతున్నాయి. హైస్పీడ్ కనెక్టివిటీతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా 50 నుంచి 60 మీటర్ల వెడల్పుతో ఆర్టీరియల్ రహదారులను రానున్న వందేళ్ల అవ
అమరావతి


అమరావతి, 02 జనవరి (హి.స.)

ఆంధ్రుల రాజధాని అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు (Seed Access Road) పనులు వేగంగా పూర్తవుతున్నాయి. హైస్పీడ్ కనెక్టివిటీతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా 50 నుంచి 60 మీటర్ల వెడల్పుతో ఆర్టీరియల్ రహదారులను రానున్న వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్మిస్తున్నారు. జాతీయ రహదారి - 16కు అనుసంధానంగా ఈ11, ఈ13, ఈ15 రహదారుల నిర్మాణం చేస్తున్నారు. ఈ క్రమంలో మరో 1.5 కిలో మీటర్ల రోడ్డు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దీంతో విజయవాడ - అమరావతి మధ్య కరకట్ట నుంచి ప్రయాణ దూరం తగ్గింది.

శుక్రవారం రాజధాని అమరావతిలో (Amaravati) రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ (Ponguru Narayana) పర్యటించారు. తన పర్యటనలో భాగంగా సీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటు గుంటూరు ఛానల్ పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా అందుబాటులోకి వచ్చిన 1.5 కిలో మీటర్ల సీడ్ యాక్సెస్ రోడ్డు వల్ల విజయవాడ నుంచి అమరావతికి కరకట్టపై ప్రయాణ దూరం తగ్గిందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande