
హైదరాబాద్, 04 జనవరి (హి.స.) వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం బంధించిన ఘటనపై ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వెనెజువెలాలో సైనిక చర్యలు చేపట్టి అక్కడి అధ్యక్షుడినే బంధించినప్పుడు.. మీరు పాకిస్థాన్కు వెళ్లి 26/11 ఉగ్రదాడికి పాల్పడిన మాస్టర్మైండ్సు పట్టుకురావచ్చు కదా అని ప్రధాని మోదీని ఉద్దేశించి అన్నారు. ట్రంప్ చేసినప్పుడు మీరెందుకు చేయలేరని ప్రశ్నించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు