
హైదరాబాద్, 04 జనవరి (హి.స.)
వలస ప్రాంత జిల్లాగా పేరుగాంచిన
పాలమూరుకు నీరు అందించాలని అటు గత బీఆర్ఎస్ పార్టీకి గానీ, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ సరైన చిత్తశుద్ధి లేదు అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి, పటాన్చెరు నియోజకవర్గాలకు చెందిన బీజేపీ నాయకులు కార్యకర్తలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత 10 సంవత్సరాల్లో కృష్ణా నదీ జలాల విషయంలో అప్పటి సీఎం చంద్రశేఖర్ రావు ఢిల్లీకి వెళ్లి సంతకం పెట్టిన పేపర్లు, తెలంగాణకు ఎన్ని టీఎంసీలు అయితే సరిపోతాయని రోజు తెలంగాణ ఉద్యమకారుడిగా అంగీకరించాడో ఈ విషయాలు చాలా స్పష్టంగా ప్రజల ముందుకు వచ్చాయన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..