కేసీఆర్ వ్యవసాయ క్షేత్రాన్ని ముట్టడించిన కాంగ్రెస్ నాయకులు
సిద్దిపేట, 04 జనవరి (హి.స.) మాజీ సీఎం, గజ్వెల్ ఎమ్మెల్యే కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రాన్ని కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. ఆదివారం గజ్వేల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు వ్యవసాయ క్షేత్రం వద్ద నిరసనకు దిగారు. కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లి గజ్వేల్ ప్ర
కెసిఆర్ వ్యవసాయ క్షేత్రం


సిద్దిపేట, 04 జనవరి (హి.స.)

మాజీ సీఎం, గజ్వెల్ ఎమ్మెల్యే కేసీఆర్

ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రాన్ని కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. ఆదివారం గజ్వేల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు వ్యవసాయ క్షేత్రం వద్ద నిరసనకు దిగారు. కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లి గజ్వేల్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం మాట్లాడాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీకి వెళ్లకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీకి రావా గజ్వేల్ ప్రజలవి ఓట్లు కావా.. ఫామ్ హౌస్ పాలన.. వద్దురా నాయనా... అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరవాత కేసీఆర్ ఒకేసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇటీవల అసెంబ్లీకి వచ్చిన ఆయన పది నిమిషాలు కూడా అసెంబ్లీలో ఉండకుండా సంతకం పెట్టి అక్కడ నుండి తిరిగి వెళ్లిపోయారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande