సంక్రాంతికి ఊరెళ్లే వారికి హైదరాబాద్ పోలీసుల కీలక సూచనలు
హైదరాబాద్, 04 జనవరి (హి.స.) సంక్రాంతి పండుగ సందర్భంగా తమ తమ స్వగ్రామాలకు వెళ్లే కుటుంబాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే వారు ముందస్తు జాగ్రత్తగా తమ పరిధిలోని సమీప పోలీస్ స్టేషన్, బీట్ ఆఫీసర్కు స
హైదరాబాద్ పోలీసు


హైదరాబాద్, 04 జనవరి (హి.స.) సంక్రాంతి పండుగ సందర్భంగా తమ తమ స్వగ్రామాలకు వెళ్లే కుటుంబాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే వారు ముందస్తు జాగ్రత్తగా తమ పరిధిలోని సమీప పోలీస్ స్టేషన్, బీట్ ఆఫీసర్కు సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ కోరారు. ఇలా సమాచారం ఇవ్వడం వల్ల పోలీసులు తమ రెగ్యులర్ పెట్రోలింగ్ లో ఆయా ఇళ్లపై ప్రత్యేక నిఘా ఉంచుతారని హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ తెలిపారు. అలాగే నేరాల నియంత్రణలో ప్రజల సహకారం ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.

అదే సమయంలో, ప్రయాణాలు చేసేటప్పుడు ఇళ్లలో నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను ఉంచవద్దని పోలీసులు గట్టిగా సూచించారు. వాటిని బ్యాంకు లాకర్లు, ఇతర సురక్షితమైన ప్రదేశాల్లో భద్రపరుచుకోవాలని కోరారు. ఈ చిన్నపాటి జాగ్రత్తలు దొంగతనాల నివారణకు తోడ్పడతాయని, తద్వారా పండుగను ప్రశాంతంగా జరుపుకోవచ్చని కమిషనర్ తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande