
జగిత్యాల, 04 జనవరి (హి.స.)
జగిత్యాల కాంగ్రెస్ లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వర్సెస్ ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మధ్య వివాదం చల్లారడం లేదు. తాజాగా మరోసారి ఎమ్మెల్యే సంజయ్ పై జీవన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ఎన్నడూ కాంగ్రెస్ జెండా మోయని వారు పార్టీ గురించి మాట్లాడుతున్నారని పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం తెలియని వాళ్లకు టికెట్లు ఇస్తానని అనడం హ్యాస్పదంగా ఉందని, మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో కథ తేలుతుందని ఆశిస్తున్నానన్నారు. జగిత్యాల మున్సిపాలిటీ అభివృద్ధి పై చర్చకైనా సిద్ధమన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే అంగట్లో సరుకు కాదని అనేక ఇబ్బందులు ఎదుర్కొని పార్టీ కార్యకర్తలు జెండాలు మోశారన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు