
నల్గొండ, 04 జనవరి (హి.స.) మునుగోడు నియోజకవర్గంలోని
ప్రజలు ఏ ఒక్కరు కూడా కంటి సమస్యతో బాధపడొద్దని ఉచిత కంటి వైద్య శిబిరాలకు శ్రీకారం చుట్టామని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో జ్యోతి ప్రజ్వలన చేసి తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం ఫీనిక్స్ ఫౌండేషన్, శంకర కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 11వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం కంటి పరీక్షల నిర్వహణ సరళిని పరిశీలించి కంటి సమస్యలతో బాధపడుతున్న వృద్ధులకు భరోసా ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు