రేవంత్ ఎప్పుడూ కేసీఆర్ మంచినే కోరుకుంటారు: చామల
హైదరాబాద్, 04 జనవరి (హి.స.) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడూ కేసీఆర్ మంచినే కోరుకుంటారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పరామర్శించారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డిపై కేటీఆర్, హరీశ్ ర
చామల


హైదరాబాద్, 04 జనవరి (హి.స.)

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఎప్పుడూ కేసీఆర్ మంచినే కోరుకుంటారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పరామర్శించారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డిపై కేటీఆర్, హరీశ్ రావు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజలకు వాస్తవాలు వివరించారని, నీళ్ల విషయంలో కేసీఆర్ ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో కమిషన్ల కోసమే ప్రాజెక్టులు కట్టారని దుయ్యబట్టారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande