కాంగ్రెస్ నాయకులకు తీపి కబురు.. జనవరి 15 లోపు అధ్యక్షుల నియామకం
హైదరాబాద్, 04 జనవరి (హి.స.) కాంగ్రెస్లో పార్టీ పదవుల విషయంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీపి కబురు చెప్పారు. 4 రోజుల్లో డీసీసీ (DCC) కార్యవర్గ కూర్పుపై నివేదిక ఇవ్వాలని టీపీసీచీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశించారు. ఈనెల 15వ తేదీలోపు మండల కాంగ్రె
మహేష్ కుమార్ గౌడ్


హైదరాబాద్, 04 జనవరి (హి.స.)

కాంగ్రెస్లో పార్టీ పదవుల విషయంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీపి కబురు చెప్పారు. 4 రోజుల్లో డీసీసీ (DCC) కార్యవర్గ కూర్పుపై నివేదిక ఇవ్వాలని టీపీసీచీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశించారు. ఈనెల 15వ తేదీలోపు మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలు అవ్వాలన్నారు. ఇవాళ డీసీసీ, టీపీసీసీ ఉపాధ్యక్షులతో జూమ్ మీటింగ్ జరిగింది. సమావేశంలో ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీసీ కార్యవర్గం కూర్పువిషయంలో మహేశ్ కుమార్ గౌడ్ కీలక ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఈ నెల 8వ తేదీన గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించబోతున్నట్లు చెప్పారు. ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగించడంపై దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande