
యాదాద్రి భువనగిరి, 04 జనవరి (హి.స.)
ఓటరు జాబితాల్లో పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి వార్డుకు సంబంధించిన ఓటర్ల వివరాలు కీలకమని, ఎన్నికల నిర్వహణకు ఈ ప్రక్రియ ఎంతో కీలకమని యాదాద్రి భువనగిరి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. ఆదివారం భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలను అదనపు కలెక్టర్ సందర్శించి 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కార్యాలయంకు విచ్చేసి, డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ను పరిశీలించారు. డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో ఏమైనా మార్పులు చేర్పుల కొరకు ఫిర్యాదు అందితే వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు