గుండెపోటుతో.మృతి చెందిన సికింద్రాబాద్ టీడీపీ.అధ్యక్షుడు.సాయిబాబా కుటుంబాన్ని సీఎం చంద్రబాబు.పరామర్శ
సికింద్రాబాద్‌ , 05 జనవరి (హి.స.)ఇటీవల గుండె పోటుతో మృతి చెందిన టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు పిన్నమనేని సాయిబాబా కుటుంబ సభ్యులను టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్‌ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదివారం పరామర్శించారు. బేగంపేట భగవంతాపూర్‌లోన
గుండెపోటుతో.మృతి చెందిన సికింద్రాబాద్ టీడీపీ.అధ్యక్షుడు.సాయిబాబా కుటుంబాన్ని సీఎం చంద్రబాబు.పరామర్శ


సికింద్రాబాద్‌ , 05 జనవరి (హి.స.)ఇటీవల గుండె పోటుతో మృతి చెందిన టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు పిన్నమనేని సాయిబాబా కుటుంబ సభ్యులను టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్‌ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదివారం పరామర్శించారు. బేగంపేట భగవంతాపూర్‌లోని సాయిబాబా ఇంటికి వచ్చిన చంద్రబాబు.. సాయిబాబా భార్య, కుమారులను యోగక్షేమాలను తెలుసుకున్నారు. సుమారు అర్థగంట సేపు అక్కడే గడిపి సాయిబాబా కుటుంబ ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. చంద్రబాబు వెంట టీడీపీ నేతలు కంభంపాటి రామ్మోహన్‌రావు, బక్కని నర్సింహులు, తీగల కృష్ణారెడ్డి, కాట్రగడ్డ ప్రసూన, నర్శిరెడ్డి, అరవింద్‌కుమార్‌గౌడ్‌, కట్టా రాములు, మండూరి సాంబశివరావు, వల్లారపు శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు. ఎన్‌టీఆర్‌ అభిమాన సంఘాల సమాఖ్య మాజీ అధ్యక్షుడిగా పిన్నమనేని సాయిబాబా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌గానూ పని చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande