వైసిపి అధినేత.జగన్.మోహన్.రెడ్డి.పై హోమ్ మంత్రి వంగలపూడి.అనిత ఆగ్రహం
అనకాపల్లి, 05 జనవరి (హి.స.) ,:వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని ధ్వజమెత్తారు. గతంలో రై
వైసిపి అధినేత.జగన్.మోహన్.రెడ్డి.పై హోమ్ మంత్రి వంగలపూడి.అనిత ఆగ్రహం


అనకాపల్లి, 05 జనవరి (హి.స.)

,:వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని ధ్వజమెత్తారు. గతంలో రైతులు రెవెన్యూ సమస్యలతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగేవారని ప్రస్తావించారు. తమ ప్రభుత్వంలో ప్రజల సమస్యలు తీర్చడానికి రెవెన్యూ శాఖ కృషి చేస్తోందని తెలిపారు. 100 మంది ప్రజలు అర్జీలు ఇస్తే, అందులో 80మందివి భూ సమస్యలే ఉన్నాయని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలో పాస్ పుస్తకాలపై జగన్ మోహన్ రెడ్డి ఫొటో వేసుకున్నారని దుయ్యబట్టారు హోంమంత్రి అనిత.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande