
కర్నూలు, 05 జనవరి (హి.స.)
, జిల్లాలో పాత కక్షలు భగ్గుమన్నాయి. తమ వర్గం వారిని హత్య చేశారని.. ప్రత్యర్థి వర్గానికి చెందిన వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎమ్మిగనూరు మండలంలోని కందనాతిలో వెంకటేశ్ (40), పరమేశ్ (35)ను ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. మరొక వ్యక్తి గోవింద్ ప్రత్యర్థుల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. వీరికి.. రెండేళ్ల క్రితం హత్యకు గురైన వర్గం వారికి వర్గపోరు నడుస్తోంది. గతంలో ఊరు వదిలి వెళ్లిపోయిన వైరి వర్గంవారు తిరిగి వచ్చారు. ఎప్పట్నుంచో వారి కోసం ఎదురు చూస్తోన్న ప్రత్యర్థులు పొలంలో పరమేశ్‌ను హత్య చేశారు. వెంకటేశ్‌ను గ్రామంలో చంపేశారు. గోవింద్ పొలం నుంచి వస్తుండగా వేటకోడవళ్లతో దాడి చేయగా.. తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలానికి డీఎస్పీ భార్గవి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ