ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. పైలెట్ అప్రమత్తతో తప్పిన ప్రమాదం
హైదరాబాద్, 05 జనవరి (హి.స.) ఎయిర్ ఇండియా విమానంలో వరుసగా సాంకేతిక లోపాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం ఓ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. శంషాబాద్ నుంచి పశ్చిమ బెంగాల్లోని
ఎయిర్ ఇండియా


హైదరాబాద్, 05 జనవరి (హి.స.)

ఎయిర్ ఇండియా విమానంలో

వరుసగా సాంకేతిక లోపాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం ఓ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. శంషాబాద్ నుంచి పశ్చిమ బెంగాల్లోని సిలిగురి (బాగ్ డోగ్రా) వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానంలో టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమానం రన్వేపై టేకాఫ్ అవుతుండగా.. టెక్నికల్ సమస్య ఉన్నట్లు పైలట్ గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పైలట్ టేకాఫ్ను నిలిపివేసి, విమానాన్ని తిరిగి సురక్షితంగా టెర్మినల్ (పార్కింగ్ బే) కు పైలట్ సమయస్ఫూర్తితో తరలించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande