అమెరికాలో తెలుగు యువతి హత్య.. తమిళనాడులో నిందితుడి అరెస్టు
హైదరాబాద్, 05 జనవరి (హి.స.) అమెరికాలోని మేరీల్యాండ్లో తెలుగు యువతి దారుణ హత్యకు గురైంది. హోవర్డ్ కౌంటీలోని ఎలికాట్ సిటీకి చెందిన తన మాజీ ప్రియుడు అర్జున్ శర్మ నివాసంలోనే నిఖితా రావు గొడిశాల (27) అనుమానాస్పదంగా మృతి చెంది కనిపించింది. కత్తిపోట్లతో అ
అమెరికా మర్డర్


హైదరాబాద్, 05 జనవరి (హి.స.) అమెరికాలోని మేరీల్యాండ్లో తెలుగు యువతి దారుణ హత్యకు గురైంది. హోవర్డ్ కౌంటీలోని ఎలికాట్ సిటీకి చెందిన తన మాజీ ప్రియుడు అర్జున్ శర్మ నివాసంలోనే నిఖితా రావు గొడిశాల (27) అనుమానాస్పదంగా మృతి చెంది కనిపించింది. కత్తిపోట్లతో అతని అపార్ట్మెంట్లో విగతజీవిగా పడి ఉండగా పోలీసులు కనుగొన్నారు. అయితే అంతకుముందే అమె మాజీ బాయ్ఫ్రెండ్ దేశం విడిచి పారిపోయాడు. దానికంటే ముందు నిఖిత కనిపించడం లేదని అతనే పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.

అర్జున్ శర్మపై ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ మర్డ్ కేసుల కింద అరెస్టు వారెంట్ జారీ చేసినట్లు హోవర్డ్ కౌంటీ పోలీసులు తెలిపారు. ఇండియాకు పారిపోయిన అర్జున్ను గుర్తించేందుకు ఫెడరల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల సాయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

హత్య అనంతరం ఇండియాకు పారిపోయి వచ్చిన అర్జున్ శర్మను ఇంటరోపోల్ పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande