ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీంకోర్టులో హరీశ్రావుకు బిగ్ రిలీఫ్
తెలంగాణ, 05 జనవరి (హి.స.) ఫోన్ ట్యాపింగ్ కేసు లో మాజీ మంత్రి హరీశ్ రావు ను విచారించేందుకు అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇవాళ ఆ పిటిషన్పై ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింద
హరీశ్రావుకు బిగ్ రిలీఫ్


తెలంగాణ, 05 జనవరి (హి.స.)

ఫోన్ ట్యాపింగ్ కేసు లో మాజీ మంత్రి హరీశ్ రావు ను విచారించేందుకు అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇవాళ ఆ పిటిషన్పై ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలను విన్న కోర్టు, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. అనంతరం తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP)ను కూడా కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. కోర్టు తాజా తీర్పుతో ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు భారీ ఊరట లభించినట్లైంది. ---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande