మావోయిస్టులకు తెలంగాణ డీజీపీ మరో పిలుపు
హైదరాబాద్, 05 జనవరి (హి.స.) దండకారణ్యంలో మిగిలిపోయిన తెలంగాణ మావోయిస్టులకు డీజీపీ శివధర్ రెడ్డి మరో కీలక పిలుపునిచ్చారు. స్వ్వచ్ఛందం గా లొoగిపోయిన వారికి పునరావాసం కల్పించడంతో పాటు, వారి మీదున్న రివార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్త
డీజీపీ మరో


హైదరాబాద్, 05 జనవరి (హి.స.)

దండకారణ్యంలో మిగిలిపోయిన తెలంగాణ మావోయిస్టులకు డీజీపీ శివధర్ రెడ్డి మరో కీలక పిలుపునిచ్చారు. స్వ్వచ్ఛందం గా

లొoగిపోయిన వారికి పునరావాసం కల్పించడంతో పాటు, వారి మీదున్న రివార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం అడవుల్లో ఉండి పోరాటం చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయని.. అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చకోవద్దని విజ్ఞప్తి చేశారు. కాగా, పీఎల్డీఏ బెటాలియన్లో 400 మందికి పైగా మావోయిస్టులు ఉండేవారని.. ఇప్పుడు వారి సంఖ్య 66కు చేరిందన్నారు. డివిజన్ సభ్యులకు రూ.5 లక్షలు, ఏరియా సభ్యులకు రూ.4 లక్షలు, మిగతా సభ్యులకు రూ.1 లక్ష రివార్డు అందజేస్తామని భరోసా ఇచ్చారు. ---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande