ఢిల్లీ గాలిలో ప్రమాదకర బాక్టీరియా.. అధికారుల హై అలర్ట్
న్యూఢి, 05 జనవరి (హి.స.) ఢిల్లీలో వాతావరణ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. తాజాగా ఢిల్లీ గాలిలో ప్రమాదకర బ్యాక్టీరియాను (Dangerous Bacteria) జే ఎన్ యు సైంటిస్టులు గుర్తించారు. యాంటీ బయాటిక్స్కు సైతం లొంగని సూపర్ బగ్ అని నిర్ధారించారు. ఢిల్లీలో
ఢిల్లీ పొల్యూషన్


న్యూఢి, 05 జనవరి (హి.స.)

ఢిల్లీలో వాతావరణ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. తాజాగా ఢిల్లీ గాలిలో ప్రమాదకర బ్యాక్టీరియాను (Dangerous Bacteria) జే ఎన్ యు సైంటిస్టులు గుర్తించారు. యాంటీ బయాటిక్స్కు సైతం లొంగని సూపర్ బగ్ అని నిర్ధారించారు. ఢిల్లీలోని మురికివాడలు, రద్దీ ప్రాంతాల్లో బాక్టీరియా జీవం పోసుకుంటున్నట్లు గుర్తించారు. WHO పరిమితి కంటే 16 రెట్లు అధిక ప్రమాదకరం అని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. న్యూమోనియా, బ్లడ్ ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుందని సూచించారు. ఇదిలా ఉండగా.. ఇవాళ ఉదయం ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక (Air Quality Index) ప్రమాదకరస్థాయిలో నమోదైంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం.. ఇవాళ ఉదయం రాజధాని నగరంలో ఓవరాల్ ఏక్యూఐ లెవెల్స్ 384గా నమోదైంది. నగరంలోని పలు ఎయిర్ మానిటరింగ్ కేంద్రాల్లో గాలి నాణ్యత సూచిక 400 మార్క్ను దాటి తీవ్రమైన కేటగిరీలో నమోదైంది. పలు ప్రాంతాలు అత్యంత ప్రభావిత ప్రాంతాలుగా అధికారులు ప్రకటించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande