
హైదరాబాద్, 05 జనవరి (హి.స.)
వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో
వింత వాతావరణం నెలకొంది. పగటిపూట చలి తీవ్రత తగ్గినప్పటికీ, తెల్లవారుజామున మాత్రం దట్టమైన పొగమంచు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది.. ముఖ్యంగా జాతీయ రహదారులపై మంచు ప్రభావం తీవ్రంగా ఉండటంతో వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధాన హైవేలపై విజిబిలిటీ 10 మీటర్ల కంటే తక్కువకు పడిపోయింది. ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా కనిపించని రీతిలో పొగమంచు కమ్ముకోవడంతో డ్రైవర్లు బెంబేలెత్తుతున్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..