
హైదరాబాద్, 05 జనవరి (హి.స.) తెలంగాణ శాసనసభ శీతాకాల
సమావేశాలకు హాజరుకాకపోవడంపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ అసెంబ్లీలో ఆయన మీడియా ప్రతినిధులతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. సభకు బిఆర్ఎస్ గైర్హాజరు కావడం, ప్రజా సమస్యలపై చర్చ నుంచి తప్పించుకోవడంపై మండిపడ్డారు. రాష్ట్రానికి కీలకమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై చర్చ జరగాలని బీఏసీ (BAC)లో బీఆర్ఎస్ పట్టుబట్టిందని, తీరా ప్రభుత్వం చర్చకు సిద్ధమైతే సమాధానం చెప్పలేక ఆ పార్టీ నేతలు భయపడి పారిపోయారని విమర్శించారు. వాళ్లకు ఇబ్బంది అనిపించిన రోజున వాకౌట్ చేశారంటే అర్థం ఉంది, కానీ మిగతా రోజులు సభకు ఎందుకు రావడం లేదో సమాధానం చెప్పాలి ఆయన ప్రశ్నించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు