సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి : మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, 05 జనవరి (హి.స.) గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం మండల కేంద్రమైన రేగోడ్ లో ఏర్పాటు చేసిన ప్రజావాణి కి కలెక్టర్ పాల
మెదక్ కలెక్టర్


మెదక్, 05 జనవరి (హి.స.)

గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలను

సత్వరమే పరిష్కరించేందుకు మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం మండల కేంద్రమైన రేగోడ్ లో ఏర్పాటు చేసిన ప్రజావాణి కి కలెక్టర్ పాల్గొని నేరుగా అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇక నుంచి జిల్లా స్థాయి అధికారిని నోడల్ అధికారిగా ప్రజావాణిలో పాల్గొంటారని చెప్పారు. అలాగే ప్రజల నుంచి వచ్చిన సమస్యల అర్జీలను ఆన్ లైన్లో కూడా ఎంట్రీ చేయడం జరుగుతుందన్నారు.

ప్రజలకు దూర భారం కావద్దనే ఉద్దేశంతో అందుబాటులోకి ప్రజావాణిని తీసుకువచ్చామన్నారు. రేగోడ్ మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలపాలని వచ్చిన వినతులను ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. ఎక్కువగా వచ్చిన భూ సమస్యల అర్జీలను పరిశీలించి ఒక వారంలోగా పరిష్కరిస్తామని చెప్పారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande