
హైదరాబాద్, 05 జనవరి (హి.స.)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు అంతర్రాష్ట్ర నదీ జలాల నిబంధనలకు విరుద్ధమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ.. పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు ను అన్ని వేదికలపై తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఈ విషయంలో ఇప్పటికే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (GRMB)కి లేఖ రాశామని, తమ అభ్యంతరాలను బోర్డు కూడా సమర్థించిందని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టును కేవలం తెలంగాణే కాదు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. ఈ వివాదంపై సుప్రీంకోర్టు లో గట్టిగా వాదనలు వినిపించాలని సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీకి సూచించామని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు