త్వరలో 850 పోస్టులు భర్తీ. మంత్రి దామోదర ప్రకటన
హైదరాబాద్, 05 జనవరి (హి.స.) ప్రభుత్వ ఆసుపత్రుల్లో అదనంగా 490 వెంటిలేటర్లు, 9 ఎంఆర్ఎ యంత్రాలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ఈ మేరకు నేడు శాసన సభప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వ దవాఖానాల్లో వెంటిలేటర్ల
మంత్రి దామోదర


హైదరాబాద్, 05 జనవరి (హి.స.)

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అదనంగా 490 వెంటిలేటర్లు, 9 ఎంఆర్ఎ యంత్రాలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ఈ మేరకు నేడు శాసన సభప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వ దవాఖానాల్లో వెంటిలేటర్ల విషయంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆరోగ్యశాఖ మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సుమారు 1790 వెంటిలేటర్ బెడ్లు ఉన్నాయన్నారు.

పెరిగిన అవసరాలకు అనుగుణంగా నిమ్స్ లో అదనంగా మరో 125 వెంటిలెటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నిమ్స్ కొత్తగా సుమారు 850 పోస్టులను భర్తీ చేయబోతున్నామని గాంధీ, ఉస్మానియా, ఆదిలాబాద్ రిమ్స్, ఎంజీఎంలో మాత్రమే ఎంఆర్ఎ యంత్రాలు ఉన్నాయి. మరో 9 ప్రభుత్వ హాస్పిటల్స్లో ఎంఆర్ఎ యంత్రాలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande