
యాదాద్రి భువనగిరి, 05 జనవరి (హి.స.)
యాసంగిలో యూరియా తిప్పలు
రైతులను వెంటాడుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో యూరియా లారీ లోడ్ వచ్చిన వెంటనే రైతులు భారీగా తరలిరావడంతో గంటలోనే లోడ్ ఖాళీ అవుతుంది. సోమవారం రాజపేట లోని పిఎసిఎస్ రేణికుంట గోదాం వద్ద భారీగా రైతులు చేరుకోవడంతో పాస్ బుక్, ఆధార్ కార్డు జిరాక్స్లు క్యూ లైన్ లో పెట్టి రైతులు వేచి చూస్తున్నారు. ఒక్కో రైతుకు రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారని పూర్తిస్థాయిలో నిలువలు అన్ని కేంద్రాల్లో పెట్టి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. అటు మన గ్రోమోర్ లోనూ రైతులకు యూరియా కోసం క్యూలైన్ లో ఉన్నారు. యూరియా కోసం రైతులు జిరాక్స్లు క్యూ లైన్లో పెట్టి వేచి ఉండడం జరుగుతుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు