'రిపబ్లిక్ డే' వేడుకల్లో తొలిసారి తెలంగాణ ఒగ్గుడోలు..
హైదరాబాద్, 05 జనవరి (హి.స.) తెలంగాణకు చెందిన ప్రత్యేక కళా నైపుణ్యం ఒగ్గుడోలుకు అరుదైన గౌరవం దక్కబోతోంది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఒగ్గుడోలు మోత మోగించనుంది. ఢిల్లీలో ఈనెల 26న జరిగే ''రిపబ్లిక్ డే'' వేడుకల్లో రాష్ట్ర ఒగ్గు కళాకారులు ఒగ్గుడోలు ప
ఒగ్గుడోలు


హైదరాబాద్, 05 జనవరి (హి.స.)

తెలంగాణకు చెందిన ప్రత్యేక కళా నైపుణ్యం ఒగ్గుడోలుకు అరుదైన గౌరవం దక్కబోతోంది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఒగ్గుడోలు మోత మోగించనుంది. ఢిల్లీలో ఈనెల 26న జరిగే 'రిపబ్లిక్ డే' వేడుకల్లో రాష్ట్ర ఒగ్గు కళాకారులు ఒగ్గుడోలు ప్రదర్శన ఇవ్వనున్నారు. తెలంగాణ సాంస్కృతిక జీవనంలో భాగమైన ఒగ్గుడోలుకు గణతంత్ర వేడుకల్లో చోటు దక్కడం ఇదే తొలిసారి. కాగా ఈ ప్రదర్శన కోసం సిద్దిపేట, జనగామ, జగిత్యాల, వికారాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల నుంచి 30 మంది కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరంతా ఈనెల 7న ఢిల్లీ వెళ్లి, 8 నుంచి రిహార్సల్స్ చేయనున్నారు. కాగా గణతంత్ర వేడుకల్లో తమ నైపుణ్యానికి చోటు దక్కడం పట్ల ఒగ్గు కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande