
హైదరాబాద్, 05 జనవరి (హి.స.) సోమవారం నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే, అంతకు ముందే బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో నెలకొన్న సంక్షోభంపై చర్చించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సెక్రటరీకి వాయిదా తీర్మానం (Adjournment Motion) అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలతో పాటు పీజీ యూనివర్సిటీల్లో విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా పడిపోవడంపై వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ విద్యపై ప్రజల్లో నమ్మకం తగ్గుతోందని, దీనికి మౌలిక వసతుల లేమే కారణమని ఆరోపించారు.
సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. ఈ క్రమంలోనే బీజేపీ సభ్యులు రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో నెలకొన్న సంక్షోభం సభలో చర్చించాలంటూ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. అయితే, స్పీకర్ వారి తీర్మానాన్ని తిరస్కరించడంతో సభలో వాయిదా గందరగోళం నెలకొంది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..