ప్రైవేటు జూనియర్ కాలేజీలపై ఇంటర్ బోర్డు కొరడా..
హైదరాబాద్, 05 జనవరి (హి.స.) నిబంధనలు ఉల్లంఘించిన 495 ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై ఇంటర్మీడియట్ బోర్డు ఏకంగా రూ.5.32కోట్ల ఫైన్ విధించింది. ప్రైవేట్ కాలేజీలు ప్రధానంగా అడ్మిషన్ల ప్రక్రియలో బోర్డు మార్గదర్శకాలను గాలికి వదిలేసినట్లు అధికారులు గుర్తించార
ఇంటర్ బోర్డు


హైదరాబాద్, 05 జనవరి (హి.స.)

నిబంధనలు ఉల్లంఘించిన 495 ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై ఇంటర్మీడియట్ బోర్డు ఏకంగా రూ.5.32కోట్ల ఫైన్ విధించింది. ప్రైవేట్ కాలేజీలు ప్రధానంగా అడ్మిషన్ల ప్రక్రియలో బోర్డు మార్గదర్శకాలను గాలికి వదిలేసినట్లు అధికారులు గుర్తించారు. షెడ్యూల్ కంటే ముందే అడ్మిషన్లు నిర్వహించడం, నిర్ణీత పరిమితికి మించి అదనపు సెక్షన్లను నిర్వహించడం, అనుమతి లేని భవనాల్లో తరగతులు నడపడం, అగ్నిమాపక నిబంధనలు పాటించకపోవడం వంటి అంశాలను గుర్తించారు. నిబంధనలను అతిక్రమిస్తే గుర్తింపు రద్దుచేస్తామని గతంలోనే హెచ్చరించినప్పటికీ మార్పు రాకపోవడంతో ఈసారి భారీ జరిమానాలతో గట్టి సంకేతాలు పంపాలని బోర్డు నిర్ణయించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande