
హైదరాబాద్, 05 జనవరి (హి.స.)
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ పేపర్ తోనే నిర్వహించాలని, అందుకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచనాప్రాయంగా ఆదేశాలు అందినట్లు సమాచారం. అయితే, 2014లో ఈవీఎంలతో, 2020లో కరోనా కారణంగా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సారి కూడా ఈవీఎం లతో నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ, బ్యాలెట్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈవీఎంలపై కొంతమంది రాజకీయ నాయకులు, ప్రజల్లో ఉన్న అపనమ్మకం ఒక కారణమైతే, బ్యాలెట్తో ఎన్నికలు నిర్వహించడం సులభం, పారదర్శకత ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, అధికారికంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఈ అంశంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..