అమెరికాలో.జరిగిన రోడ్డు.ప్రమాదంలో తెలుగు దంపతుల.మృతి
యలమంచిలి, 05 జనవరి (హి.స.) : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు దంపతులు మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన భార్యాభర్తలు కొటికలపూడి కృష్ణ కిశోర్‌ (టిన్ను) (45), ఆశ (40) వాషింగ్టన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయ
అమెరికాలో.జరిగిన రోడ్డు.ప్రమాదంలో తెలుగు దంపతుల.మృతి


యలమంచిలి, 05 జనవరి (హి.స.)

: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు దంపతులు మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన భార్యాభర్తలు కొటికలపూడి కృష్ణ కిశోర్‌ (టిన్ను) (45), ఆశ (40) వాషింగ్టన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వారి కుమార్తె, కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ మేరకు వారి కుటుంబసభ్యులకు సమాచారం అందింది.

కృష్ణ కిశోర్‌ దశాబ్ద కాలానికి పైగా అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆ దంపతులు 10 రోజుల క్రితం పాలకొల్లు వచ్చి తిరిగి వెళ్లారు. మార్గంమధ్యలో దుబాయ్‌లో న్యూఇయర్‌ వేడుకల్లో పాల్గొన్నారు. వీరి మృతితో పాలకొల్లులో విషాదఛాయలు అలముకున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande