
హైదరాబాద్, 05 జనవరి (హి.స.)
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి విస్తరణ, నగర పరిధిలో ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా హైవేపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ముఖ్యంగా హయత్నగర్, పంత్ కాలనీ, భాగ్యలత పరిసర ప్రాంతాల్లో రహదారి పనులు జరుగుతుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్డును ఇరుకుగా చేయడంతో భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు కదలలేక గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోయాయి.
మరోవైపు హయత్నగర్ జంక్షన్ వద్ద వాహనాలు కిలో మీటర్ల మేర బారులు తీరాయి. దీంతో స్కూళ్లు, కళాశాలలు, ఆఫీసులకు వెళ్లే వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా అంబులెన్సులు కూడా సకాలంలో గమ్య స్థానాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు స్పాట్కు చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..