
హైదరాబాద్, 05 జనవరి (హి.స.)
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ప్రభుత్వ విప్, కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. త్యాగాల కుటుంబమైన రాహుల్ గాంధీ కుటుంబంపై కేటీఆర్ మాట్లాడుతుంటే.. సిగ్గేస్తోందని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీపై అనుచితంగా, అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీని ఉరి తీయాలంటూ బలుపుతో మాట్లాడటం దారుణమని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలపై అసెంబ్లీలో చర్చించాల్సిన సమయంలో కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు చర్చకు రాకుండా పారిపోయారని బీర్ల ఐలయ్య విమర్శించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు