బార్ కౌన్సిల్ ఎనికల్లో పోటీ చేసే అభ్యర్ధులకు నామినేషన్ ఫేస్ 50 వేలు
అమరావతి, 06 జనవరి (హి.స.), :బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నామినేషన్‌ ఫీజును రూ.50 వేలుగా ఖరారు చేస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించింది. నామినేషన్‌ ఫీజును ఒకేసారి రూ.30వేల నుంచి రూ.1.25 లక్షలకు పెంచడాన్ని తప్పుబట్టింది. మరోవైపు గతంలో
బార్ కౌన్సిల్ ఎనికల్లో పోటీ చేసే అభ్యర్ధులకు నామినేషన్ ఫేస్ 50 వేలు


అమరావతి, 06 జనవరి (హి.స.), :బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నామినేషన్‌ ఫీజును రూ.50 వేలుగా ఖరారు చేస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించింది. నామినేషన్‌ ఫీజును ఒకేసారి రూ.30వేల నుంచి రూ.1.25 లక్షలకు పెంచడాన్ని తప్పుబట్టింది. మరోవైపు గతంలోలాగే నామినేషన్‌ ఫీజును రూ.30 వేలుగా ఉంచాలన్న పిటిషనర్ల అభ్యర్థనను తోసిపుచ్చింది. అలాగే బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్‌ కల్పించేలా ఆదేశాలివ్వాలన్న అభ్యర్థనను కూడా తిరస్కరించింది. ఈ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్లకు సూచించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌ సోమవారం తీర్పు ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande